స్వాధీనం చేసుకున్న డబ్బులు, బాధితుడు షాహీర్
రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
చెన్నూర్, న్యూస్‌లైన్ : చెన్నూర్ వీఆర్వో జామీర్ అలీ రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. తహశీల్దార్ కార్యాలయంలో మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. మంధిని గ్రామానికి చెందిన చౌకత్ అలీకి చెందిన సర్వే నంబర్ 991లో 247, 242 గజాల చొప్పున రెండు ప్లాట్లను మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ 2012లో కొనుగోలు చేశాడు.
ఆ ప్లాట్లను షాహీర్ మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిష్టర్ చేయించుకున్నాడు. నెల రోజుల క్రితం ప్లాట్లకు రెవెన్యూ ప్రొసీడింగ్ కావాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. చెన్నూర్ వీఆర్వో జామీర్‌అలీ ప్రొసీడింగ్ కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. పది రోజుల క్రితం రూ.4 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మరో రూ.6 వేలు ఇస్తేనే ప్రొసీడింగ్ ఇస్తానని వీఆర్వో జామీర్ అలీ వేధించగా ఈ నెల 15న బాధితుడు షాహీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
గురువారం స్థానిక తహ శీల్దార్ కార్యాలయంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండుగా పట్టుకున్నామని చెప్పారు. అతని వద్ద నుంచి రూ.6 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీఆర్వో జామీర్‌అలీ ఆస్తుల పై విచారణ చేస్తామని చెప్పారు.
ప్రజల్లో చైతన్యం రావాలి :
లంచాలు అడిగితే ఏసీబీని ఆశ్రయించాలనే చైతన్యం ప్రజల్లో రావాలని కరీంగనర్ ఏసీబీ డీఏస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. లంచాలు ఇవ్వాలని అధికారులు వేధింపులకు గురి చేస్తే నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలన్నారు. లంచం అడిగితే ఫోన్ 9440446150 చేయాలని సూచించారు.
వేధింపులు భరించలేక...
ప్రొసీడింగ్ కోసం వీఆర్వో జామీర్ అలీ నెల రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నడు. మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు తిరిగి తిరిగి చాల బాధపడ్డాను. ఆయన వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. నా మాదిరిగా వేధింపులు వేరే వాళ్లకు ఉండ కూడదనే ఉద్దేశంతో లంచ ం అడిగిన వీఆర్వోను పట్టించానని బాధితుడు షాహీర్ తెలిపారు.