నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో విష జ్వరాలు ప్రబలాయి.
నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో విష జ్వరాలు ప్రబలాయి. దీంతో గ్రామంలోని 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో 10 మంది డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నై, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు.