అప్పుల బాధ తాళలేక దూలానికి ఉరివేసుకొని రైతు తోట కిషన్ (43) శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.
చెన్నూర్ : అప్పుల బాధ తాళలేక దూలానికి ఉరివేసుకొని రైతు తోట కిషన్ (43) శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథ నం ప్రకారం.. చెన్నూర్ పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన కిషన్ తనకున్న రెం డెకరాల భూమితోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ ఏడాది పత్తి పంట సాగు చేశా డు.
వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి రాలేదు. మూడేళ్ల నుంచి వరుసగా పంట నష్టపోవడంతో సుమారు రూ.6లక్షల వరకు అప్పయ్యాడు. ఇవి ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెందాడు. భార్య మధునక్క చేనుకు వెళ్లగా, ఇద్దరు కూతర్లు మానస, మౌనిక కళాశాలకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి కిషన్ దూలానికి ఉరి వేసుకున్నాడు. చిన్న కూతురు కళాశాల నుంచి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. ఎంత పిలిచిన పలకక పోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.