సాక్షి, చేర్యాల (సిద్దిపేట): మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన జాతీయ బహుభాషా కవి సమ్మేళనంలో మండల పరిధిలోని గుర్జకుంట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రేణుకుంట్ల మురళికి ‘కళాత్మ’ బిరుదుతో పాటు పురస్కారాన్ని అందించారు. కవి, గాయకుడిగా పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి రాషష్ట్ర, జాతీయ అవార్డులు గ్రహించి మాతృభాష పరిరక్షణకు కట్టుబడి తనకలం, గళంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మురళి ఇటీవల జరిగిన మాతృభాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘మన భాష-శ్వాస’ కవితను ఆలపించినందుకు అభినందిస్తూ ‘కళాత్మ బిరుదు’ ‘భాషాశ్రీ’ పురస్కారంతో మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్, తెలంగాణ భాష-యాస గ్రంథ రచయిత, మంజీరా సాహితీవేత్త రాజారెడ్డి చేతుల మీదుగా షీల్డ్‌ను బహుకరించి ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన మురళిని స్థానిక కవులు, ప్రముఖులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment