అంగ్రాజ్‌పల్లి(చెన్నూర్ రూరల్) : ఏఎన్‌ంలు స్థానికంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌వో రుక్మిణమ్మ వైద్యులను ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామంలోని పీహెచ్‌సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల రిజిస్టర్లను, పీహెచ్‌సీలో మందుల స్టాక్‌ను పరిశీలించారు.
మండలంలో పీహెచ్‌సీ తరఫున వైద్యశిబిరాలు పెడుతున్నారా లేదా ఆరా తీశారు. డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ, మందులు ఎక్స్‌పైరీ అయిన వెంటనే తీసేయాలని సూచించారు. పీహెచ్‌సీలో డెలివరీలు అయ్యేలా చూడాలని క్లస్టర్ వైద్యుడు సత్యనారాయణకు, పీహెచ్‌సీ వైద్యురాలు అరుణశ్రీని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు గ్రామాల్లో తిరిగి గర్భిణుల ఆరోగ్య స్థితిగతులు ఆరా తీయాలని స్పష్టం చేశారు. వారవారం సమావేశమవ్వాలని పేర్కొన్నారు.
ఆస్పత్రి అభివృద్ధికి అదనపు నిధులు
చెన్నూర్ : ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి అభివృద్ధికి వచ్చే నిధులతో పాటు అదనంగా మరిన్ని మంజూరు చేస్తానని జిల్లా వైద్యాధికారిని రు క్మిణమ్మ అన్నారు. మంగళవారం స్థానిక ప్ర భుత్వ సివిల్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూర్ ఆస్పత్రికి కోటపల్లి, వేమనపల్లి మండలాల రోగులు వస్తారని, దీని సా ్థయి పెంచి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చే యాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రా జిరెడ్డి వైద్యాధికారిని కోరారు. తనవంతు కృ షి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం రోగులను పరీక్షించారు. ఎంపీపీ మైదం కళావ తి, సర్పంచ్ ఎస్.కృష్ణ పాల్గొన్నారు.
బాలింత మృతిపై విచారణ
ఈ నెల 20న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత కుందేటి ప్రమీల(28) వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బాధితులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యాధికారిని రుక్మిణమ్మ చెన్నూర్‌కు వచ్చిన సందర్భంగా దీనిపై గోప్యంగా విచారణ జరిపారు. ప్రమీల మృతిచెందిన వార్డుకు వెళ్లి వార్డులో ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలింత ప్రమీల వ్యక్తిగత కేశీట్‌ను పరిశీలించారు. కాలేయంలో నీరు రావడంతోనే ప్రమీల మృతి చెందిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉండాలి
Published Wed, Nov 26 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement