
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
కొండపేట(చెన్నూరు): చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన జెండాల మస్తాన్(36) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ వినోద్‌కుమార్, మృతుని బంధువుల కథనం మేరకు..మస్తాన్ ట్రాక్టర్‌లో వరిపొట్టు పోసే కూలీగా వెళ్లేవాడు. బుధవారం రాత్రి భార్య, కుమారుడు, అదే గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి బాగా కడుపు నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పడంతో తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. ఈ వేళలో వెళ్లేందుకు ఇబ్బందని ఉదయాన్నే వెళదామని చెప్పడంతో కుమార్తెను పడుకోమని చెప్పి, మస్తాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే కొడుకు వెళ్లి తలుపు తట్టగా తీయకపోవడంతో తోసి చూడగా పైపునకువేలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో కిందకు దించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.