కవి సమ్మేళనంలో రమాదేవిని సన్మానిస్తున్న నిర్వాహకులు
చెన్నూర్: పట్టణానికి చెందిన బొల్లంపల్లి రమాదేవి కవితలు,రచనలు చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకుంటూ పలువురి మన్ననలు పొందారు. హృదయ స్పందన అనే కవిత పుస్తకాన్ని రచించి అందరి మనసులను దోచుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర నలుమూలలో నిర్వహించిన కవి సమ్మేళనాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకుంది. జాతీయ సాహితీ పురస్కారం అందుకోవడమే తన లక్ష్యంగా సాహిత్య రంగాల్లో ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు రమాదేవి పాల్గొన్న కవి సమ్మేళనాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
రమాదేవి ప్రస్థానం
రమాదేవి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని. దేవరకొండ కమలాదేవి, యాదగిరిలకు జన్మించింది. చెన్నూర్‌కు చెందిన బొల్లంపల్లి పున్నంచంద్‌తో వివాహమైంది. ఏంఏ తెలుగు, బీఎడ్, సోషీయాలజీ పూర్తి చేసింది. ప్రస్తుతం చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.
రాష్ట్రస్థాయి పురస్కారం
మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలోని తెలంగాణ భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రమాదేవికి రాష్ట్రస్థాయి ఎంవీ నరసింహారెడ్డి పురస్కారం అందజేశారు. రాష్ట్ర స్థాయి పురస్కారం లభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
సన్మానాలు, సత్కారాలు
- రామగుండం నగరపాలక సంస్థ 2016లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రశంసపత్రం, అవార్డు
- తెలంగాణ రైతు హార్వేస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి కవిత అవార్డు
- సహస్ర కవి సమ్మేళనంలో ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించిన పోటీల్లో సన్మానం
- ఉదయ కళానిధి సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళా వైభవం పేరుతో నిర్వహించిన కవి సమ్మేళనంలో సన్మానం, ప్రశంస పత్రం
- 1116 మంది కవులతో ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్‌లో ప్రశంస పత్రం
- 2018 ఆగష్టు 15న చెన్నూర్‌లో నీర్ల మధునయ్య జయంతి వేడుకల్లో సాహిత్య పురస్కారం
జాతీయ స్థాయిలో గుర్తింపే నా లక్ష్యం
సాహిత్య రంగాభివృద్ధికి నావంతు కృషి చేస్తా. దిగజారిపోతున్న నైతికత విలువలను కాపాడే విధంగా సాహిత్యం ఉండాలన్నదే నా ఉద్దేశం. అవార్డు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలుతో అనేవి ప్రతిభకు గుర్తింపుగా వస్తూ ఉంటాయి. సన్మానాలతో అగిపోకుండా నా రచనలు నిరంతర సాగిస్తా. జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించడమే నా ముందున్న లక్ష్యం.
– బొల్లంపల్లి రమాదేవి, కవి రచయిత, చెన్నూర్
Comments
Please login to add a commentAdd a comment