చెన్నూర్ (ఆదిలాబాద్) : స్త్రీల వైద్య నిపుణురాలిగా అవతారమెత్తిన ఓ నర్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్‌లో గత మే 15 వ తేదీన ప్రారంభించిన ఓ నర్సింగ్‌హోంలో నాగమణి చెన్ను అనే మహిళ.. స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలి(ఎంఎస్, ఓబీజీ)గా చేరింది. గత మూడు నెలలుగా రోగులకు సేవలందిస్తోంది. అయితే రోగులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తుండటం, సరైన మందులు రాయకపోవడంతో యాజమాన్యానికి అనుమానం వచ్చింది. ఆసుపత్రి వైద్యులకు ఆమె సర్టిఫికెట్‌పై అనుమానం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు నాగమణి స్వగ్రామం విజయవాడకు వెళ్లి విచారణ చేపట్టారు. గుంటూరులో నాగమణి చెన్ను అనే వైద్యురాలు లేదని, ఈ నాగమణి గుంటూరు ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా మాత్రమే పని చేసిందని తెలిసింది. నకిలీ సర్టిఫికెట్‌తోపాటు రిజిస్ట్రేషన్ నంబరు 65699తో చెన్నూర్‌లో పని చేసింది. హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెంట్ ద్వారా ఇక్కడ చేరింది. నాగమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెన్నూర్ ఎస్సై చందర్ తెలిపారు.
పోలీసుల అదుపులో నకిలీ వైద్యురాలు
Published Thu, Aug 20 2015 7:44 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement