మత్తుమందు ఇచ్చి లైంగికదాడి | Crime News: Nalgonda Government Employee Rape Woman | Sakshi
Sakshi News home page

మత్తుమందు ఇచ్చి లైంగికదాడి

Published Tue, Jul 26 2022 2:12 AM | Last Updated on Tue, Jul 26 2022 11:09 AM

Crime News: Nalgonda Government Employee Rape Woman - Sakshi

చందూలాల్‌ 

డిండి: ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడటమేకాక అనంతరం ఆమె నగ్న చిత్రాలు తీసి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. కొద్ది రోజులు మానసికంగా కుంగిపోయిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ మృగాడి ఘాతు కం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లికి చెందిన ముడావత్‌ చందూలాల్‌ (40) శంషాబాద్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం జేత్యతండాకు చెందిన ఓ మహిళ (28) భర్త చనిపోవడంతో బతుకుదెరువుకు తన ఇద్దరు పిల్లల తో కలసి ఆరేళ్లుగా శంషాబాద్‌లో ఉంటూ కూలీగా జీవనం సాగిస్తోంది.  

కన్నేసి.. కోరిక తీర్చాలని.. 
అదే ప్రాంతంలో ఉంటున్న చందూలాల్‌ ఆ వితంతు మహిళపై కన్నేశాడు. ఆమె తో పరిచయం పెంచుకుని కోరిక తీర్చాలని వేధింపుల కు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ రెండు నెలల క్రితం పిల్లలతో కలసి బంధువుల ఊరైన నల్లగొండ జిల్లా డిండి మండలం వీరబోయనపల్లి తండాకు మకాం మార్చింది. దీంతో చందూలాల్‌ జూన్‌ 27న అర్ధరాత్రి మత్తు మందు ఉంచిన చేతి రుమాలుతో ఆ మహిళ ఉంటున్న ఇంటికి వెళ్లాడు.

ఆమె తలుపు తీయగానే రుమాలును ముఖంపై పెట్టడంతో స్పృహ కోల్పోయింది. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన చందూలాల్‌ ఆమె నగ్న చిత్రాలు సెల్‌ఫోన్‌లో తీసు కుని వాట్సాప్‌లో ఆమెకే పంపించి బెదిరిస్తున్నాడు. బాధితురాలు ఈనెల 23న శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు కేసును 24న డిండి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా నిందితుడిని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement