శుభకార్యానికి వెళుతూ మృత్యువాత | Government Employee killed in road accident | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళుతూ మృత్యువాత

Published Mon, May 26 2014 1:57 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

శుభకార్యానికి వెళుతూ మృత్యువాత - Sakshi

శుభకార్యానికి వెళుతూ మృత్యువాత

 కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :బంధువుల ఇంట జరుగుతున్న శుభ కార్యానికి వెళుతూ ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని పట్టణానికి చెందిన బిళ్లకుర్తి రవికుమార్ (42) కాకినాడలోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. యానాంలో ని బంధువుల ఇంట్లో వివాహం జరుగుతుండడంతో భార్య, ఇద్దరు కుమారులు రెండు రోజుల క్రితమే అక్కడకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం రవికుమార్ మోటార్ బైక్‌పై తుని నుంచి యానాం బయలుదేరాడు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని తురంగేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్.. బైక్‌ను ఢీ కొట్టింది.
 
 అదుపుతప్పిన అతడు ట్యాంకరు వెనుక చక్రాల కింద పడ్డాడు. ట్యాంకర్ డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని నడపడంతో చక్రాల మధ్యలో ఇరుక్కున్న రవి కుమార్ నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. రవికుమార్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సుమారు 50 మీటర్ల మేర మాంసపు ముద్దలు పడి ఉండడంతో సంఘటనా స్థలం
 భయానకంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement