మదనపల్లి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చీకలబయలు పంచాయతీ పరిధిలోని శాస్త్రులగడ్డ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనలో తల్లి రాణి (30), కూతుర్లు పూజిత (11), గౌతమి (8) ప్రాణాలు కోల్పోయారు. వీరు ఓ బావిలో మృతిచెంది ఉన్నట్లు మంగళవారం ఉదయం గుర్తించారు. సర్పంచ్ నాగవేణి అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
Published Tue, Jan 26 2016 8:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement