కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా.. | Son And Daughters Did Not Perform The Last Rites To Mother | Sakshi
Sakshi News home page

కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..

Published Fri, May 17 2024 12:53 PM | Last Updated on Fri, May 17 2024 2:17 PM

Son And Daughters Did Not Perform The Last Rites To Mother

సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.

కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్‌రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.

తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement