తల్లీ, కుమార్తెల ఆత్మహత్య | mother and daughter suicide in chittoor district | Sakshi
Sakshi News home page

తల్లీ, కుమార్తెల ఆత్మహత్య

Published Tue, Jan 5 2016 11:34 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కుటుంబ పోషణ కష్టం కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలసి ఆత్మహత్య చేసుకుంది.

పుంగనూరు: కుటుంబ పోషణ కష్టం కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఉలవలదిన్నెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయమ్మ(35) భర్త శ్రీనివాసులు కూలి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు.


కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ భారం జయమ్మపై పడింది. ఓ వైపు మతిస్థిమితం లేని భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ, నిఖిత, పల్లవి కుమార్తెలతో కుటుంబ పోషణ కష్టమవ్వడంతో మనస్తాపానికి గురైంది. బట్టలు ఉతుక్కుందామనే నెపంతో నిఖితను గ్రామానికి సమీపంలోని కుంట వద్దకు తీసుకెళ్లింది. కుమార్తెతో సహా అందులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కొంత ఆలస్యంగా కుంట వద్దకు చేరిన పల్లవి కుంటలో మునిగిపోతున్న తల్లిని చూసి కేకలు వేసింది. గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఎస్‌ఐ హరిప్రసాద్‌కు సమాచారమివ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని గాలించారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందితో గాలించారు. సాయంత్రం తల్లీ కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement