
మైసూరు: రెండేళ్ల కుమార్తెను కన్నతల్లి నీటి బకెట్‌లో ముంచి కర్కశంగా హతమార్చి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో శుక్రవారం చోటు చేíసుకుంది. వివరాలు... గట్టివాడి గ్రామానికి చెందిన మహాదేవ ప్రసాద్, అన్నపూర్ణ (22) భార్యభర్తలు. రెండేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. వీరికి ఓ పాప. ఇంటిలో తరచూ గొడవలు వస్తుండటంతో విసిగిపోయిన అన్నపూర్ణ తన కుమార్తెను నీటి బకెట్‌లో ముంచి హత్య చేసి ఆపై తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో..
హత్యగా తేల్చిన శవపరీక్ష నివేదిక
బనశంకరి: ఓ వ్యక్తి మృతి కేసులో శవపరీక్ష నివేదికలో హత్య అని తేలడంతో విచారణ చేపట్టిన కొడిగేహళ్లి పోలీసులు రెండు నెలల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు... మత్తికెరెలో కర్ణాటక ఫోర్క్‌స్టాల్‌లో షంషీర్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అక్టోబర్‌లో 17న ప్రదీప్ యాదవ్ దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో షంషీర్, ప్రదీప్ మధ్య గొడవ జరిగింది. షంషీర్ తూకం రాయితో ప్రదీప్‌పై దాడి చేశాడు. అక్కడే ఉన్న దుకాణం యజమాని సోదరుడు ఆటోలో ప్రదీప్‌ను కేసీ ఆస్పత్రి తరలించారు. డాక్టర్లు పరీక్షించి నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లాడు. 20న ఇంట్లో ఉండగా ప్రదీక్‌యాదవ్ కిందపడి పోయాడు. కుటుంబ సభ్యులు బాప్టిస్ట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి డాక్టర్లు ప్రదీప్ గాయంకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి షంషీర్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment