కూతురు కులాంతర వివాహం చేసుకుందని..
నాగోలు:నాగోలు: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో మనస్థాపానికి గురైన ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పుష్ప (45) భర్త చనిపోవడంతో కూతురు (19)తో కలిసి ఉంటోంది. డిప్లొమో పూర్తి చేసిన ఆమె కూతురు పూజిత ఈ నెల 15న కర్నూలు జిల్లాకు చెందిన పీర్‌బాబును సూర్యపేటలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.
వారం రోజుల క్రితం భర్తతో కలిసి ఇంటికి వచ్చిన కుమార్తెను పీర్‌బాబును వదిలేయాలని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపానికి లోనైన పుష్ప ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.