బ్రిటన్‌లో భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. తూర్పు లండన్‌లోని ఓ ఇంట్లో షిఘీ రితేశ్‌కుమార్(37) అనే మహిళ, ఆమె కవల కూతుర్లు నియ(13), నేహ(13)లు అనుమానాస్పద రీతిలో మరణించగా, వారి మృతదేహాలను పోలీసులు మంగళవారం గుర్తించారు.
షిఘీ భర్త రితేశ్‌కుమార్ పుల్లార్‌కటిల్(44) కోసం పోలీసులు గాలించగా, సమీపంలోని ఓ రిజర్వాయర్ వద్ద ఉరివేసుకుని మరణించిన స్థితిలో ఆయనను బుధవారం కనుగొన్నారు. అయితే, భార్య, కూతుళ్లను హత్య చేసిన రితేశ్‌కుమార్ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కేరళలోని రితేశ్ బంధువులకు సమాచారం చేరవేసి, సంప్రదింపులు సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.