
సవతి తల్లి ప్రేమే ఎక్కువే
సవతి పిల్లలను ప్రేమించే వారి సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. పిల్లల్ని చిత్ర హింసలకు గురి చేసే సవతి తల్లుల గురించి తెలుసు కానీ తండ్రి కంటే ఎక్కువగా సవతి తల్లే ప్రేమిస్తుండడం విశేషం. నటుడు ప్రకాష్‌రాజ్, నటి డిస్కో శాంతి చెల్లెలు లలితా కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పూజా, మేగ్నా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల ముందు ప్రకాష్ రాజ్ లలితా కుమారి విడిపోయారు. అనంతరం ప్రకాష్ రాజ్ ముంబాయికి చెందిన బోనీవర్మ అనే నృత్య దర్శకురాలను ప్రేమించి మరో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. అయితే ప్రకాష్ రాజ్ తొలి సంతానం కూడా వీరి వద్ద పెరుగుతున్నారు. వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారా? అన్న ప్రశ్నకు బోనీకపూర్ బదులిస్తూ తనది పిల్లల్ని హింసించే మనస్తత్వమా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువగా ఆయన పిల్లల్ని తాను ప్రేమిస్తున్నట్లు తెలిపారు. సవతి తల్లులు పిల్లల పట్ల ప్రేమతో మెలగాలని ఆమె పేర్కొన్నారు.