ఎప్పటికైనా ఫస్ట్‌ హీరో మాత్రం నాన్నే.. | special story to heroines fathers | Sakshi
Sakshi News home page

డి అండ్‌ డి స్క్రీన్‌పై ఢీ

Published Sun, Apr 1 2018 12:50 AM | Last Updated on Sun, Apr 1 2018 1:09 AM

special story to heroines fathers - Sakshi

అమ్మాయిలకు చాలామంది రోల్‌ మోడల్స్‌ ఉండొచ్చు కానీ ఎప్పటికైనా ఫస్ట్‌ హీరో మాత్రం నాన్నే. నాన్నే సూపర్‌ హీరో. నాన్న నడిచిన బాటలో వెళ్లడమే కాకుండా ఇప్పుడు నాన్నతో కలిసి నటిస్తున్నారు కొందరు
కూతుళ్లు. నటిగా బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ల నాన్నతో కలిసి యాక్ట్‌ చేస్తున్న హీరోయిన్లు కొందరైతే, నడక నేర్చుకున్నాక తండ్రితో కలిసి నటిస్తున్నవారు మరికొందరు. ఆన్‌ స్క్రీన్‌ కూడా ‘డాడ్‌ అండ్‌ డాటర్స్‌’గానటిస్తున్నవారు కొందరైతే.. కూతురి కోసం స్పెషల్‌ రోల్స్‌ చేస్తున్నవారు మరికొందరు. ఆ డాడ్‌ అండ్‌ డాటర్స్‌ గురించి తెలుసుకుందాం.


నాన్న కూచి
మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్‌ నిహారిక.  సిల్వర్‌ స్క్రీన్‌ పై హీరోయిన్‌గా నిరూపించుకోకముందే ‘ముద్ద పప్పు ఆవకాయ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్‌ అయిన నిహారిక ఇటీవల డాడ్‌  నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇందులో వీళ్లిద్దరూ డాడ్‌ అండ్‌ డాటర్‌గా నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను చూపించడమే కాకుండా కూతురు లవ్‌ స్టోరీ – తండ్రి లవ్‌స్టోరీ అంటూ రెండు ట్రాక్స్‌ వేసి, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆన్‌లైన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్‌ సిరీస్‌ను నిహారిక తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌పై నిర్మించారు.



                                                                  నిహారిక, నాగబాబు

తొమ్మిదేళ్లకుతండ్రికి కూతురిగా...
కమల్‌హాసన్‌ విలక్షణ నటుడు. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోయగల సామర్థ్యం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమేనా? కథా రచయిత, దర్శకుడు, గాయకుడు.. మొత్తంగా మల్టీ టాలెంటెడ్‌ పర్శన్‌. మరి ఆయన రక్తం అంటే ఎలా ఉంటుంది? సేమ్‌ ఆయన లక్షణాలే పుణికి పుచ్చుకుని ఉంటారు కదా. శ్రుతీహాసన్‌ కూడా సేమ్‌ తండ్రిలాగే మల్టీ టాలెంటడ్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కమల్‌హాసన్‌ ‘హే రామ్‌’ సినిమాలో గెస్ట్‌ అపియరెన్స్‌ ఇచ్చింది శ్రుతి. అలాగే కమల్‌ నటించిన ‘దేవర్‌ మగన్‌’కి ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడింది. పెద్దయ్యాక ఏకంగా తండ్రి నటించిన ‘ఈనాడు’ సినిమా ద్వారా సంగీత దర్శకురాలిగా మారింది. మరి.. చిన్నప్పుడు ‘హే రామ్‌’లో నటించారు కదా.. పెద్దయ్యాక ఎప్పుడు నటిస్తారు? అనే ప్రశ్నకు ‘శభాష్‌ నాయుడు’తో ఫుల్‌స్టాప్‌ పెట్టారు శ్రుతి. కథానాయికగా ఇండస్ట్రీలోకి వచ్చిన  తొమ్మిది సంవత్సరాల తర్వాత తండ్రి కమల్‌తో కలిసి ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘శభాష్‌ నాయుడు’లో కమల్, శ్రుతి రీల్‌ లైఫ్‌లో కూడా తండ్రీ కూతుళ్లులా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.


                                                                                          కమల్, శ్రుతి

కూతురి లవ్‌స్టోరీకి నాన్న సపోర్ట్‌
చిన్నప్పుడు నాన్న ఎన్నో కథలు చెబుతాడు. వాటిలో కొన్ని రియల్‌ లైఫ్‌ స్టోరీలై ఉండచ్చు. ఏమో పేర్లు మార్చి చెప్పిన లవ్‌స్టోరీలు ఉండొచ్చు. అలా సోనమ్‌ కపూర్‌కి ఆమె తండ్రి అనిల్‌ కపూర్‌ బోలెడన్ని కథలు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు కూతురి లవ్‌స్టోరీకి సపోర్ట్‌ చేస్తున్నారు. అయితే ఇది రీల్‌ లవ్‌స్టోరీ. ‘సావరియా’ అనే బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ మూవీతోనే ఇండస్ట్రీకు వచ్చిన సోనమ్‌ పదేళ్ల తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాకే తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు.  ‘1942 ఎ లవ్‌ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్‌ కపూర్‌ పాడిన ఫేమస్‌ సాంగ్‌  ‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఏశా లగా...’ టైటిల్‌తో షెల్లీ చోప్రధర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఇందులోనే తండ్రి అనిల్‌కపూర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు సోనమ్‌. ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్‌ టైమ్‌ మా నాన్నగారితో కలిసి యాక్ట్‌ చేస్తున్నాను. మీకు ‘ఆన్‌ స్క్రీన్‌ డాటర్‌’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అని సోనమ్‌ ట్వీటర్‌లో పేర్కొంటే ‘‘మనిద్దరం కలిసి యాక్ట్‌  చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్‌గా రిజెక్ట్‌ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కలిసి యాక్ట్‌ చేయబోతున్నాం. నీకు ఎగై్జటెడ్‌గా ఉందేమో. నాకు మాత్రం చాలా నెర్వస్‌గా ఉంది’’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు అనిల్‌కపూర్‌. ఈ సినిమా అక్టోబర్‌ 12న విడుదల కానుంది.


                                                            సోనమ్, అనిల్‌ కపూర్‌

నాన్న తోడుగా...
దెబ్బ తగిలితే ఎవరైనా అమ్మా అంటారు. కానీ పాము కనిపిస్తే మాత్రం చిన్నతనంలో మోస్ట్‌లీ నాన్ననే పిలుస్తారు. కానీ నాన్నే పాము మనిషి ఐతే ?? నాన్న చేయి పట్టుకోవడానికి తోడుగా వెళ్లడానికి కొంతమంది మాత్రమే రెడీగా ఉంటారు. ఈ లిస్ట్‌లోనే ఉన్నారు హీరోయిన్‌ వరలక్ష్మీ. 2012లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి రోల్స్‌ చేస్తున్న వరలక్ష్మీ ఫస్ట్‌ టైమ్‌ తండ్రి శరత్‌ కుమార్‌తో కలిసి యాక్ట్‌ చేస్తున్నారు. శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో ఏ. వెంకటేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పాంబన్‌’. ఈ సినిమాలో తండ్రితో కలిసి వెండితెరను పంచుకోబోతున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఇందులో సగం శరీరం పాములా మారిన వ్యక్తి పాత్రలో కనిపించ నున్నారు శరత్‌కుమార్‌. ఆల్రెడీ షూటింగ్‌ కూడా స్టారై్టంది. ఇందులో వరలక్ష్మీ
ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.


                                                            శరత్‌కుమార్, వరలక్ష్మి

డాటర్‌ లవ్‌కు నాన్న డైరెక్షన్‌!
కూతురికి ఎవరైనా లవ్‌లెటర్‌ రాస్తే తండ్రి ఊరుకుంటారా? ఉహూ.. కొత్త అవతారం చూపించి లెటర్‌ రాసిన కుర్రాడి కాళ్లు విరగ్గొడతాడు. కానీ యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మాత్రం అందరిలా కాదు. డిఫరెంట్‌ ఫాదర్‌. అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకొని తన కోసం అర్జునే ఓ లెటర్‌ రాసి ఇచ్చాడు. నచ్చలేదంది, ఇంకోటి రాశాడు. ఇది చాలా బావుందని నవ్వేసింది. ఇంకో అడుగు ముందుకేసి ఎందుకైనా మంచిదని సీన్‌లోకి స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చారు. కానీ ఇదంతా రీల్‌ లైఫ్‌లోనే.. ‘ప్రేమ బహార’ అనే సినిమా కోసం అన్నమాట. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దర్శకత్వం వహించి, తన కుమార్తె ఐశ్వర్యను కన్నడ పరిశ్రమకు పరిచయం చేస్తూ తీసిన సినిమా ‘ప్రేమ బహార’. ఈ సినిమా కోసం మూడు లవ్‌స్టోరీలు రాసి, తన కుమార్తెకు వినిపించారట అర్జున్‌. ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ స్టోరీ నచ్చలేదన్నారట. చివరికి మూడో స్టోరీ నచ్చి నటించటానికి ఒప్పుకున్నారట. ఈ టైటిల్‌ను కుడా అర్జున్‌ పాత సినిమా ‘ప్రతాప్‌’లోని ఒక పాటలో నుంచి తీసుకున్నారట. ఇటీవల రిలీౖజñ  థియేటర్స్‌ వద్ద డీసెంట్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.


                                                అర్జున్, ఐశ్వర్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement