
అందుకు నా కుమార్తెలకు అడ్డు చెప్పను:ఒబామా
వర్జీనియా: తన ఇద్దరు కూతుర్లు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తానంటే అందుకు అడ్డు చెప్పనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కానీ వారి గురించి దిగులు చెందుతానని తన తండ్రి ప్రేమను దాచుకోలేక పోయారు. మీ ఇద్దరు కుమార్తెలు మాలియా(18), సషా(15) లు యూఎస్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తానంటే మీరు ఏవిధంగా స్పందిస్తారని మాజీ ఆర్మీ అధికారి సీఎన్ఎన్ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఫోర్ట్ లీ మిలిటరీ బేస్ క్యాంపులో ఒబామా మాట్లాడుతూ..దేశ భక్తి,క్రమశిక్షణ విషయంలో ఆర్మీ తనను ఏవిధంగా ప్రభావితం చేసిందో వివరించారు.మీ పిల్లలు,ఎప్పటికీ మీ పిల్లలే వారిని బంధించడానికి ప్రయత్నించకండి వారిని స్వేచ్చగా వదిలేయండని పేర్కొన్నారు. అప్పుడే వారు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఆర్మీలో ఉన్నత వర్గాల వారి ప్రాతినిత్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.