
చెన్నై,తిరువొత్తియూరు: ఇద్దరు కుమార్తెలపై లైంగిక దాడి చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి సమీపంలోని తిరునిండ్రవూరుకు చెందిన మురళి (36) కట్టడ కార్మికుడు. ఇతనిపై తిరువళ్లూరు మహిళా పోలీసుస్టేషన్‌లో లైంగిక దాడి కేసులు, అలాగే తండయారుపేట పోలీసుస్టేషన్‌లో జంట హత్యల కేసు నమోదైంది. తిరునిండ్రవూరు పోలీసుస్టేషన్లో రౌడీ షీటర్‌గా నమోదైంది. మొదటి భార్యకు కలిగిన 16 ఏళ్ల కుమార్తె ఉంది. మొదటి భార్య మృతి చెందడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే వివాహమై 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె కేటరింగ్ పనులకు వెళుతున్న సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు కుమార్తెలపై లైంగిక దాడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ సంగతి తెలియడంతో రెండో భార్య దీనిపై ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి మురళిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.