లక్నో: మరణించిన కుమారుడి మృతదేహన్ని అంత్యక్రియలు జరపకుండా 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్‌లో ఉంచాడు ఓ తండ్రి. కూమారుడు హత్య చేయబడ్డాడని ఆరోపిస్తూ ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించడానికి తండ్రి నిరాకరించాడు. దీంతో అధికారులు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివాంక్ పాఠక్ 2012 నుంచి ఢిల్లీలోని కాల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడ తనకు గుర్లీన్ కౌర్ అనే యువతి పరిచయమైంది. వీళ్లూ ఇద్దరూ 2013 లో వివాహాం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న శివాంక్ ఆగస్ట్ 1న అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మృతదేహానికి ఢిల్లీలో పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసులు అతడి తండ్రికి అప్పగించారు. అయితే అతని తండ్రి కూమరుడు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. శివాంక్ పాఠక్ పేరు మీద భారీ ఆస్తి ఉన్నందున, అతని భార్య ఆస్తి ఎలాగైనా దక్కించకోవాలని నిర్ణయించుకుందని తండ్రి శివప్రసాద్ పాఠక్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే తన కూమరుడుని హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో తనకు న్యాయం జరిగేంత వరకు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోనని చెప్పారు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా శివాంక్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి తన ఇంట్లో భద్రపరిచాడు. కాగా కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని, లేనిపక్షంలో శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటామని సుల్తాన్‌పూర్ జిల్లా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అయితే యూపీలోని అధికార బీజేపీతోపాటు, ఎస్పీ, ఆప్ స్థానిక నేతలు శివ ప్రసాద్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. దీంతో కుమారుడి మృతదేహానికి మంగళవారం రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తామని సుల్తాన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీష్ గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment