నిజామాబాద్‌: అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్య | Three Assassinated In Nizamabad District | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్య

Published Thu, Dec 9 2021 2:27 PM | Last Updated on Thu, Dec 9 2021 2:31 PM

Three Assassinated In Nizamabad District - Sakshi

డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌): నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రం 44వ నంబర్‌ జాతీయ రహదారి నాగ్‌పూర్‌ గేటు వద్ద హీరో షోరూం పక్కనే ఉన్న గురునానక్‌ పం జాబీ గ్యారేజ్‌లో మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం గ్యారేజ్‌ ఓనర్‌ వచ్చి చూసే వరకు హత్యల విషయం తెలియరాలేదు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, అడిషనల్‌ డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు  ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా ఒకరు సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

చదవండి: కొండగట్టు అద్దె గదుల్లో వ్యభిచారం... ముగ్గురి అరెస్టు!!

హత్యకు గురైన వారిలో హార్వెస్టర్‌ మెకానిక్‌ హర్పాల్‌సింగ్‌ (33), అతని బంధువుగా అనుమానిస్తున్న హార్వెస్టర్‌ డ్రైవర్‌ జోగిందర్‌సింగ్‌ (48)తో పాటు క్రేన్‌ డ్రైవర్‌గా పనిచేసే బానోత్‌ సునీల్‌ (బోజ్యానాయక్‌ తండా, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా) (22) ఉన్నారు. గ్యారేజ్‌ లోపల పడుకున్న హర్పాల్‌సింగ్, జోగిందర్‌ సింగ్‌ను గుర్తు తెలి యని దుండగులు ఆయుధంతో తలపై బలం గా కొట్టి హత్య చేశారు.

ఆరు బయట నిద్రిస్తున్న సునీల్‌ ముఖంపై పదునైన ఆయుధంతో మూడుచోట్ల పొడిచి చంపారు. పోలీసులు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను, క్లూస్‌ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీస్‌ డాగ్‌ హత్యా స్థలం నుంచి 44వ నంబర్‌ జాతీయ రహదారిపై కొంత దూరంలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లి నిలిచిపోయింది. పక్కనే ఉన్న హీరో షోరూంలోని సీసీ టీవీ ఫుటేజీలను కమిషనర్‌ సుమారు మూడు గంటలపాటు పరిశీలించారు.  వీలైనం త త్వర గా హంతకులను పట్టుకుంటామని సీపీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement