![Husband Assassinated Man Who Had Illicit Affair With His Wife - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/24/Assassinated002.jpg.webp?itok=dHSWzuWz)
హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ ఆంజప్ప
రామసముద్రం (చిత్తూరు జిల్లా): భార్యతో సహజీవనం చేస్తున్నాడన్న ఆగ్రహంతో వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన ఘటన రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ రవికుమార్ కథనం మేరకు.. దిగువలంభంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె ఆదిలక్ష్మికి.. పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు అర్జున్‌కు 20ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కలహాల వల్ల నాలుగేళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకాకి చెందిన శ్రీనివాసులు అలియాస్ ఆంజప్ప(41)తో ఆదిలక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ దిగువలంభంవారిపల్లెలో సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం ఆమె భర్త అర్జున్‌కు తెలియడంతో గురువారం రాత్రి ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆంజప్పపై బండరాయితో మోది పారిపోయాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని గాయపడిన ఆంజప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతిచెందాడు. శవపరీక్ష నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ మధుసూధన్‌రెడ్డి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే..
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment