
శంషాబాద్ రూరల్: జగన్నాథ్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న శ్రీకాంత్‌గౌడ్, తదితరులు
విధుల్లో ఒత్తిడి, పనిభారంతోనే పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ యాదయ్య అన్నాడు.
సాక్షి, షాద్‌నగర్‌రూరల్: విధుల్లో ఒత్తిడి, పనిభారంతోనే పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ యాదయ్య అన్నాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ కార్యదర్శి ఆత్మహత్యకు నిరసనగా గురువారం ఫరూఖ్‌నగర్ మండల పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి జగన్నాథ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగంగా జగన్నాథ్ ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందకున్నారని అన్నారు. గ్రామంలో చేపట్టిన పనులకోసం ఖర్చు చేసిన బిల్లుల విషయంలో గ్రామ ఇంచార్జి సర్పంచ్, అధికారులు సహకరించకపోవడంతో ఆ త్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులసంఘం మండల అధ్యక్షుడు శ్రీరాం, çపంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, అనిల్, పండరీనా«థ్, మహేష్. ఫయాజ్, రాజేందర్, ముజఫర్, రామకృష్ణ, స్వాతి, అరుణ, నందిని, ప్రవళిక పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
శంషాబాద్ రూరల్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్.శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జగన్నాథ్ చిత్ర పటానికి ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ప్రతిభ, శ్రీనివాస్‌రెడ్డి, అనిత, కృష్ణకాంత్, పంచాయతీ కార్యదర్శులు సురేష్, శశిధర్‌రెడ్డి, అశ్విని, భాస్కర్, ఇర్ఫాన్, శ్రీకాంత్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడవద్దు..
మొయినాబాద్ రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కోవాలని మొయినాబాద్ ఎంపీడీఓ విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా పూల్‌కల్ మండలం మిన్‌కూర్ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ గ్రామ అభివద్ధిలో ఖర్చు చేసిన డబ్బుల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీఓ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, మల్లేష్, దీపలత, తారాభాయ్, ప్రియాంక, లావణ్య, వనజ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట...
కొత్తూరు: సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ చిత్రపటానికి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం పలువురు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎంపీఓ శ్రీనివాస్, ఏఓ గోపాల్, ఏఈఓలు సనా, దీపిక, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్ రూరల్: జగన్నాథ్ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న పంచాయితీ కార్యదర్శులు