Author goes on trial for her spouses Assassinate Case: కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. నిందితులు తాము చేయాలనుకునే నేరం కోసమే ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తారో లేక యాదృచ్చికంగా జరుగుతాయో తెలియదు. కానీ ఇక్కడొక రచయిత విషయంలో అలానే జరిగింది.
వివరాల్లోకెళ్తే...నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ రొమాన్స్ కథల స్వీయ రచయిత. అయితే ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసుని ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాన్సీ 2018లో అరెస్టు అయినప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. ఆమె భర్త సౌత్‌వెస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్‌లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురైయ్యాడు. ఆయన్ని ఎవరో తపాకీతో కాల్చి చంపారు. అయితే ఆమె తన భర్త మృతి చెందడానికి కొన్ని వారాల ముందు హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అనే పేరుతో ఒక నవల రాయడం గమనార్హం. తొలత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ కేసుగా అనిపించింది.
అయితే తదనంతర విచారణల నేపథ్యంలో ఆమె అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరాల్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అయితే న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్‌నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం లాంటి దారుణానికి ఆమె ఒడిగట్టిందని అన్నారు.అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా అన్నారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదన్నారు. ఈ మేరకు ఈ కేసు ఏడు వారాలపాటు విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి తెలిపారు.
(చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..)
Comments
Please login to add a commentAdd a comment