వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే.. | Parents Who Assassinated The Son In Anantapur District | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చేతిలో కొడుకు హతం

Published Sat, Apr 24 2021 9:17 AM | Last Updated on Sat, Apr 24 2021 9:18 AM

Parents Who Assassinated The Son In Anantapur District - Sakshi

ఘటనా స్థలంలో ప్రతాప్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

అమడగూరు(అనంతపురం జిల్లా): వేధింపులు భరించలేక తల్లిదండ్రులే కన్న కొడుకును హతమార్చిన ఘటన అమడగూరు మండలంలోని మద్దెమ్మగుడిపల్లిలో చోటు చేసుకుంది. సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివారెడ్డి, భాగ్యమ్మలకు కుమారుడు ప్రతాప్‌రెడ్డి, కూతురు శశికళ సంతానం. కుమార్తెకు వివాహం చేసి పంపారు. కుమారుడు ప్రతాప్‌రెడ్డి మాత్రం రోజూ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే పదిహేను రోజులుగా కొత్త ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ పలుమార్లు వాగ్వాదానికి దిగాడు.

ఈ బాధను భరించలేక తల్లిదండ్రులు కుమార్తెతో చెప్పుకుని రోదించారు. ప్రతాప్‌రెడ్డి గురువారం రాత్రి బైక్‌ కొనివ్వాలంటూ తల్లి భాగ్యమ్మను చితక్కొట్టాడు. గ్రామస్తుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ప్రతాప్‌రెడ్డి మద్యం మత్తులో తల్లిని మరోసారి కొడుతుండగా తండ్రి శివారెడ్డి భరించలేక ఇద్దరూ ఏకమై కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సోదరి శశికళ ఫిర్యాదు మేరకు సీఐ, ఎస్‌ఐ గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

చదవండి: ఆ నలుగురు ఔట్‌..! 
‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement