
మాధవరెడ్డి (ఫైల్)
డబ్బు విషయంగా గొడవపడి కట్టుకున్న భర్తనే భార్య హతమార్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మాధవరెడ్డి (61)కి 35 ఏళ్ల క్రితం చిన్నయక్కలూరుకు చెందిన కాంతమ్మతో వివాహమైంది.
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): డబ్బు విషయంగా గొడవపడి కట్టుకున్న భర్తనే భార్య హతమార్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మాధవరెడ్డి (61)కి 35 ఏళ్ల క్రితం చిన్నయక్కలూరుకు చెందిన కాంతమ్మతో వివాహమైంది. రెండేళ్లుగా డబ్బు విషయంగా వీరి మధ్యలో మనస్పర్థలు తలెత్తాయి. బుధవారం ఉదయం డబ్బు కోసం ఒకరినొకరు దూషించుకున్నారు. (చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..)
ఆ సమయంలో ఇంటిలో ఉన్న రోకలిబండ తీసుకుని భర్తను చితకబాదింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు తలకు తీవ్ర గాయమై రక్తమోడుతూ మాధవరెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని తాడిపత్రిలోని సీహెచ్‌సీకి, అక్కడి నుంచి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. ఘటనపై తాడిపత్రి రూరల్ సీఐ మల్లికార్జున గుప్త కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చదవండి:
కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది