
నల్లకుంట: కర్కశంగా మారిన ఓ మహిళ తన సవతి కుమారుడిని గొంతు నులిమి హతమార్చింది.ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేసన్ పరిధిలో జరిగింది. సీఐ హబీబుల్లా తెలిపిన మేరకు.. భాస్కర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి గోల్నాకలో నివాసముంటున్నాడు. అతని కుమారుడు ఉజ్వల్ (7) రెండు వారాల క్రితం భవనంపై నుంచి కింద పడిపోగా గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా కోలుకుని ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో శనివారం ఉజ్వల్‌ను సవితి తల్లి సరిత గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. బాలుడి మృతిపై అనుమానంతో శనివారం తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సరిత తన సవతి కుమారుడిని పథకం ప్రకారం హత్య చేసినట్టు విచారణలో తేలింది. రెండు వారాల క్రితం భవనంపై నుంచి తోసేసినా బతకడంతో గొంతునులిమి చంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ప్రాణాలు తీసిన ఈత సరదా)
Comments
Please login to add a commentAdd a comment