
మైసూరు: ప్రశాంతంగా ఉండే మైసూరులో ఘోరం చోటుచేసుకుంది. పెళ్లయిన వ్యక్తి ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మండ్య జిల్లాలోని హొంబాళె కొప్పలు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు హెచ్,ఎం.లోకేష్ (30), నాగమంగలకు చెందిన అమూల్య (25)ను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. లోకేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఒక కుమార్తె కూడా ఉంది. మైసూరులో ఎమ్మెస్సీ చదివే అమూల్యతో తాను వివాహితుడనని చెప్పకుండా షికార్లకు తిరిగాడు. (చదవండి: పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. జవాను ఆత్మహత్య)
ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా, మాట్లాడాలని చెప్పి బుధవారం సాయంత్రం మైసూరులోని ఒక హోటల్‌లో రూం తీసుకున్నారు. అక్కడ ఏం గొడవ జరిగిందో అతడు అమ్మాయిని గొంతు నులిమి చంపి తన స్నేహితునికి ఫోన్ చేసి చెప్పి తరువాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు, పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. హెబ్బాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: దుపట్టాతో ఉరి.. తొడపై సూసైడ్ నోట్!)
Comments
Please login to add a commentAdd a comment