పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం | Mother Killed Son in Tamil Nadu For Boyfriend | Sakshi
Sakshi News home page

బాలుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published Wed, Aug 7 2019 6:40 AM | Last Updated on Wed, Aug 7 2019 6:53 AM

Mother Killed Son in Tamil Nadu For Boyfriend - Sakshi

అరెస్టయిన వడకాశి, స్వామినాథన్‌

తమిళనాడు, అన్నానగర్‌: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడాదిన్నర కుమారుడిని పొట్టనపెట్టుకుందో కసాయి తల్లి. ఈ దారుణ ఘటన నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువేంకటమ్‌ తాలుకా పళంగోటైకి చెందిన భాగ్యమ్‌ కుమారుడు రాజ్‌ (45) అదే ప్రాంతంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య వడకాశి (35). వీరికి తానేష్‌ ప్రభాకరన్‌ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తూత్తుకుడి జిల్లా కలుగుమలై నడు వీధికి చెందిన స్వామినాథన్‌ (32) పాలవ్యాపారి. ఇతనికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామినాథన్‌ రాజ్‌ ఇంటికి పాలు పోసేవాడు. ఈ క్రమంలో వడకాశితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ కలుసుకునే వారు.

విషయం తెలుసుకున్న రాజ్‌ ఇద్దరిని మందలించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. తమ సంబంధానికి అడ్డు వస్తే తానేష్‌ను హత్య చేసి స్వామినాథన్‌తో వెళిపోతానని వడకాశి భర్తను బెదిరిందింది. దీంతో రాజ్‌ తన కుమారుడిని మామ చెల్లయ్య ఇంట్లో ఉంచాడు. సోమవారం కుమారుడిని చూడాలని ఉందని చెప్పిన వడకాశి కోవిల్‌పట్టికి వెళ్లింది. అనంతరం ఇంటికి వెళ్లకుండా స్వామినాథన్‌తో వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో వారి కోసం రాజ్‌ చుట్టుపక్కల వెతికాడు. మరోపక్క అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో స్వామినాథన్, వడకాశి ఏకాంతంగా గడుపుతుండగా కుమారుడు తానేష్‌ ప్రభాకరన్‌ ఆకలితో ఏడ్చాడు. ఆగ్రహానికి గురైన ఇద్దరూ బాలుడిని కొట్టారు. అదే సమయంలో అక్కడ గాలిస్తున్న రాజ్‌కు బిడ్డ అరుపులు వినబడ్డాయి. దీంతో అక్కడికి వెళ్లి కేకలు వేశాడు. స్థానికులు అక్కడికి వచ్చే లోగా వడకాశి బిడ్డని తీసుకుని బయటికి పరుగెత్తింది. తరువాత వడకాశి తన బిడ్డ మిద్దెపై నుండి జారి పడినట్లు చెప్పి ప్రభుత్వాస్పత్రిలో చేర్చింది. అక్కడ చికిత్స పొందుతూ తానేష్‌ ప్రభాకరన్‌ మృతి చెందాడు. పోలీసుల విచారణలో తల్లి, ఆమె ప్రియుడు కొట్టడంతోనే మృతి చెందినట్లు తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement