
కుమార్తెకు విషమిచ్చి చంపి ప్రియుడితో కలిసి మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది.
టీ.నగర్: కుమార్తెకు విషమిచ్చి చంపి ప్రియుడితో కలిసి మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది. నీలగిరి జిల్లా కూడలూరు ఓవేలి బాలవాడికి చెందిన విజయలక్ష్మి (27). ఈమె మేనమామ కనకరాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. ఇరువురు ఏడేళ్ల క్రితం తిరుపూర్ బోయంపాళయంలో ఉంటూ బనియన్ కంపెనీలో పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణి (39)తో విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీన్ని కనకరాజ్, సుబ్రమణి భార్య, ఆమె బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలావుండగా కుమార్తె, సుబ్రమణితో కలిసి విజయలక్ష్మి శుక్రవారం కూడలూరు బాలవాడిలోని పుట్టింటికి చేరుకుంది. వీరి వివాహేతర సంబంధం గురించి విజ యలక్ష్మి కుటుంబంలో శనివారం వివాదం చెలరేగింది. మనస్తాపానికి చెందిన ఆమె ఇంటి సమీపంలోని తోటకు వెళ్లి కుమార్తెకు విషమిచ్చి చంపింది. అనంతరం ప్రియుడు సుబ్రమణితో కలిసి విషం తీసుకుంది. స్పృహతప్పి పడిపోవడంతో వారిని కూడలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శనివారం ఇరువురూ మృతిచెందారు.