తల్లి మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో కుమార్తె.. | Mother Illegal Affair With Other Person Daughter Commits Suicide | Sakshi
Sakshi News home page

తల్లి పాపం.. కుమార్తెకు శాపం

Published Mon, Apr 8 2019 12:14 PM | Last Updated on Mon, Apr 8 2019 12:14 PM

Mother Illegal Affair With Other Person Daughter Commits Suicide - Sakshi

తల్లి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనోవేదనతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.

టీ.నగర్‌: తల్లి మరొకరితో వివాహేతర సంబం ధం పెట్టుకోవడంతో మనోవేదనతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. విల్లుపురం జిల్లా, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) వితంతువు. ఈమె భర్త వెంకటేశన్‌ ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. ఇదిలావుండగా కవితాదేవికి అదే ప్రాంతానికి చెందిన రాజేం ద్రన్‌ (33) అనే గ్రామ సహాయకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువరూ ఇంట్లో స న్నిహితంగా ఉండడం గమనించిన కుమార్తె, ప్లస్‌ వన్‌ చదువుతున్న భాగ్యలక్ష్మి (16) రాజేంద్రన్‌ను హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజేంద్రన్‌ భాగ్యలక్ష్మిపై చెప్పుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement