
నిందితురాలు బాలమ్మ ఇంట్లో లభించిన వస్తువులు
వనపర్తి ,అమ్రాబాద్ (అచ్చంపేట): వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ బీసన్న సోమవారం తెలిపిన వివరాలు.. మండలంలోని మన్ననూర్‌కు చెందిన బుడగజంగం ఆంజనేయులు(22) అదే గ్రామానికి చెందిన బాలమ్మ(అలియాస్ బాలమణి) అనే మహిళతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన ఆంజనేయు లు తల్లి నారమ్మ, మామ శ్రీనివాసులు ఇద్దరినీ పంచాయతీ పెద్దల సమక్షంలో మందలించారు. ఇదే క్రమంలో మామ శ్రీనివాసులు తన కుమార్తెతో ఆంజనేయులుకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి విషయమై ఈ నెల 5న వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు.
అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయమై బాలమ్మ ఆంజనేయులుతో గొడవ పడి ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసింది. ఆంజనేయులు చనిపోయాక గోనె సంచిలో కట్టి ఇంటి సమీపంలో ఎస్‌బీఐ బ్యాంకు పక్కన గల డ్రెయినేజీ కల్వర్టులో పడేసింది. విషయం తెలియని ఆంజనేయులు కుటుంబీకులు ఈ నెల 6వ తేదీన యువకుడు అదృశ్యమైనట్లు అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన మన్ననూర్ ఎబీఐ ఎదుట కాల్వ నుంచి దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా మృతదేహం లభ్యమైంది. ఆంజనేయులు మృతదేహంగా గుర్తించి విచారణ చేపట్టారు. బాలమ్మ హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment