అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్‌సీసీ జెడ్పీటీసీ హత్యకు గురయ్యారు. జెడ్పీటీసీ వారం నూకరాజును దుండుగులు హత్య చేశారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ దారుణం జరిగింది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
నూకరాజు హత్యకు పోలీసులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకరాజుకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. గతంలో కూడా నూకరాజుపై హత్యాయత్నం జరిగిందని.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నూకరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు.


