ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు | Wife Killed Husband With Her Boyfriend in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్త హత్య: ప్రియుడు సహా భార్య అరెస్టు

Jul 20 2019 8:25 AM | Updated on Jul 20 2019 8:25 AM

Wife Killed Husband With Her Boyfriend in Tamil Nadu - Sakshi

తమిళనాడు, తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తేని జిల్లా తేవారం మేట్టుపట్టికి చెందిన చెల్లదురై (50). అతని భార్య సెలీనా (43). 20 సంవత్సరాల క్రితం ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తేవారం మీనాక్షిపురానికి చెందిన సుధాకర్‌ (27)తో సెలీనాకువివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న చెల్లదురై భార్యను ఖండించాడు. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. బుధవారం రాత్రి సుధాకర్‌ను ఇంటికి రప్పించిన సెలీనా అతనితో కలిసి నిద్రిస్తున్న భర్త చెల్లదురైపై బండరాయి వేసి హత్య చేశారు. దీనిపై చెల్లదురై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుధాకర్‌ను, సెలీనాను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement