వివాహేతర బంధం : భార్యను గొలుసులతో కట్టేసి.. | Man Keeps Wife In Chains For Ten Years | Sakshi
Sakshi News home page

వివాహేతర బంధం : భార్యను గొలుసులతో కట్టేసి..

Published Sun, May 26 2019 12:19 PM | Last Updated on Sun, May 26 2019 12:19 PM

Man Keeps Wife In Chains For Ten Years - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను భర్త అత్యంత దారుణంగా హింసించిన ఘటన వెలుగుచూసింది. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనలో బాధిత మహిళను పోలీసులు కాపాడటంతో భర్త రాక్షస ప్రవర్తన బయటి ప్రపంచానికి తెలిసింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం గురించి తనను ప్రశ్నించడంతో ఆగ్రహించిన భర్త తన భార్యను తీవ్రంగా కొట్టి చైన్లతో కట్టిపడేసి పదేళ్లుగా నిర్భందంలో ఉంచడం కలకలం రేపింది.

ఈ పదేళ్ల కాలంలో మహిళను ఆమె భర్త  దొమర్‌ పటేల్‌ తరచూ ఇనుప రాడ్లతో కొట్టడంతో పాటు  తీవ్రంగా హింసించేవాడని పోలీసులు వెల్లడించారు. ఆమెకు ఆహారం కూడా ఇచ్చేవాడు కాదని, పిల్లలు ఆమెకు తిండి పెడితే వారినీ నిందితుడు తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. పదేళ్ల కిందట వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇది వారి కుటుంబ వ్యవహారమని చెబుతూ బంధువులు, స్ధానికులు ఈ విషయం పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఓ మహిళను గొలుసులతో బంధించారన్న సమాచారంతో మహిళా హక్కుల సంఘానికి చెందిన బృందం ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement