అక్రమ బంధాన్ని ప్రశ్నిస్తే దాడి చేశాడు | Husband Assault on Wife in front of Human Rights Commission | Sakshi
Sakshi News home page

అక్రమ బంధాన్ని ప్రశ్నిస్తే దాడి చేశాడు

Published Thu, Mar 19 2020 8:32 AM | Last Updated on Thu, Mar 19 2020 8:32 AM

Husband Assault on Wife in front of Human Rights Commission - Sakshi

దాడిలో గాయపడ్డ శాంతి

నాంపల్లి: భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన ఓ మహిళపై ఆమె భర్త అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ వద్ద జరిగింది.  పోలీసులు, బాధితులు  తెలిపిన మేరకు.. మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ శివానందనగర్‌లో నివాసం ఉండే  మహేష్‌ భార్య కళావతితో మౌనేష్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు.  ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య కళావతి పథకాన్ని రచించింది. భర్త ఇంట్లో నిద్రించే సమయంలో యాసిడ్‌ దాడి చేసింది. ఈ దాడిలో మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి  కళావతి తన ఇద్దరు ఆడ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేర ప్రవృత్తి కలిగిన తన భార్య వద్ద పిల్లలు ఉంటే జీవితం నాశనం అవుతుందని, తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని,  లేనిపక్షంలో స్టేట్‌ హోంకు తరలించి చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మహేష్‌ ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ  కేసు  కమీషన్‌ ఎదుట బుధవారం విచారణ జరగాల్సి ఉండేది. విచారణకు మహేష్‌తో పాటు భార్య కళావతి హాజరైంది. మౌనేష్‌ కూడా అక్కడకు వస్తాడనే విషయం ముందుగా తెలిసింది. అయితే  కళావతి పరిచయం అనంతరం తన భర్త మౌనేష్‌ ఇంటికి రావడం లేదని శాంతి అనే మహిళ  బుధవారం మానవహక్కుల కమిషన్‌కు వచ్చింది.  అక్కడ మౌనేష్‌ను భార్య శాంతి మౌనేష్‌ను నిలదీసింది. భార్య ప్రశ్నించడాన్ని భరించలేని మౌనేష్‌ ఆమెపై దాడిచేశాడు. దాడిలో శాంతి మూతి పండ్లు రాలిపోయాయి. తీవ్ర రక్తస్రావం అయ్యింది.  బాధితురాలిని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య తన చాంబరులోనికి ఆహ్వానించి సమస్యను తెలుసుకున్నారు.  కమిషన్‌ ఎదుట భార్యపై భర్త దాడి చేయడంపై కమీషన్‌ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement