
పట్టుబడిన కానిస్టేబుల్ రామర్, లక్ష్మి
తమిళనాడు, తిరువొత్తియూరు : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలు.. తిరుచ్చిజిల్లా తురైయూర్ పులివలానికి చెందిన సంతోష్(25), లక్ష్మి(27) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సంతోష్ నాలుగునెలల క్రితం పనివెదుక్కుంటూ చెన్నైకు వెళ్లాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మికి భర్త సమాచారం తెలియలేదు. దీంతో భర్త అదృశ్యమైనట్లు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్ రామర్(43) ఆమెపై కన్నేశాడు. తరచూ విచారణ పేరుతో లక్ష్మి ఇంటికి రాకపోకలు సాగించి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గుర్తించిన ఇరుగుపొరుగు వారు శనివారం అర్ధరాత్రి లక్ష్మి ఇంట్లో రామర్ ఉండగా బయట తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ ముత్తుసామి తలుపులు తెరిపించి కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment