
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ రీటైలర్ అమెజాన్ శాంసంగ్‌స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్ మొబైల్ ఫెస్ట్ ప్రకటించింది. దీని ద్వారా మరోసారి భారీ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్ 27నుంచి మూడురోజులపాటు ఈ ఆఫర్లను అందించనుంది. ఈ సేల్ ద్వారా రూ.4700 దాకా డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది. అలాగే సేల్‌లో కొనుగోలు చేసిన అన్ని శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలుపై రిలయన్స్ జియో ద్వారా 90 జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో, ఆన్ 7 ప్రో పై రూ .800 ఫ్లాట్ రాయితీ, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో గెలాక్సీ ఆన్ 5 ప్రో రూ .7,190, ఆన్ 7 ప్రో రూ .8,690కి లభ్యం కానుంది. ఎక్స్చేంజ్ తరువాత వీటి ధరలు వరుసగారూ. 6050, రూ.7770గా ఉంటుంది. దీంతోపాటు మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే5 రూ .900 తో ఫ్లాట్ తగ్గింపులో విక్రయిస్తోంది. దీన్ని రూ .10,090 కోసం కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా.
మిడ్ సెగ్మెంట్‌లో బిగ్గెస్ట్ బ్యాటరీ గెలాక్సీ ఏ9 ప్రో రూ. 2,300 తగ్గింపు తర్వాత రూ. 22,900 కు లభిస్తుంది. దీనిపై రూ 9,500 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కూడా ఉంది.
గెలాక్సీ ఎ 7, ఏ5 అమెజాన్ 4 వేల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. గెలాక్సీ ఎ 7, రూ .4,710 డిస్కౌంట్ అనంతరంరూ. 22,910కు విక్రయిస్తోంది. అంతేకాదు దీనిపై రూ. 9,500 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. గెలాక్సీ ఏ5పై రూ .4,510 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ .19,990 కి లభ్యం. రూ. 9,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment