అమెజాన్ ప్రైమ్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వల్ల ప్రారంభ ప్లాన్ ధరలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధరలను అధికం చేసింది. ఇందులో నెల, మూడు నెలల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే రూ. 179 ఉన్న అమెజాన్ నెల వారీ మెంబర్‌షిప్ ఇప్పుడు రూ. 299 కి చేరింది. అంటే ఈ ధర ఒక్క సారిగా రూ. 120 పెరిగింది. దీని ప్రకారం కొత్త అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఖచ్చితంగా రూ. 299 చెల్లించాల్సిందే.
ఇక మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే, రూ. 499 గా ఉన్న మూడు నెలల ప్లాన్ ఇప్పుడు రూ. 599కి చేరింది. ఈ ధరలు కూడా రూ. 140 వరకు పెరిగాయి. ముందుగానే నెల, 3నెలలు ప్లాన్ సబ్‍స్క్రైబ్ చేసుకున్నవారు, ఆటో రెన్యూవల్ సెట్ చేసుకున్న వారు పాత ధరలకే ఈ ప్లాన్స్ పొందవచ్చు. ఇవి 2024 జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొత్త ధరలు వర్తిస్తాయి.
(ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!)
కొత్తగా అమెజాన్ ప్రైమ్ పొందాలనుకునే వారు కొత్త ధరలకే సబ్‍స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు, సినిమాలు టీవీషోలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ లో షాపింగ్ బెనిఫీట్స్ కూడా లభిస్తాయి. అంతే కాకుండా అమెజాన్ మ్యూజిక్ ఉచితంగానే ఎంజాయ్ చేయవచ్చు.
ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment