sixdays
-
కేవలం ఆరో రోజుల్లోనే ఆరు వేల పడకల ఆసుపత్రి... ఎలాగంటే
A temporary hospital is being constructed in China: ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడ్డాం అని ఊపిరి తీసుకుంటున్న ప్రపంచ దేశాలకు మళ్లీ భయంకరమైన భారీ షాక్ తగిలింది. చైనాలో కరోనా కలకలం అంటూ వస్తున్న వార్తలు అందర్నీ కలవరపాటుకు గురి చేశాయి. దీంతో చైనాలోని అధికారులు సైతం అప్రమత్తమై కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు విధించింది కూడా. అంతేకాదు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో కేసులు అధికంగా ఉండటంతో తాత్కాలికా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఇది 6 వేల పడకల గల ఆసుపత్రి అని చెప్పారు. పైగా ఈ ఆసుపత్రి ఆరు రోజుల్లోనే వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కానీ చైనా కరోనా మహమ్మారి మొదటి, రెండు ఫేజ్ల్లోనూ ఇలాంటి తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించింది. జిలిన్ ప్రావిన్స్ మార్చి 12 నాటికి మూడు తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించింది. ఈ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ యంత్రాంగం జాగురుకతతో వ్యవహరించలేదని జిలిన్ ప్రావిన్షియల్ హెల్త్ కమీషన్ అధికారి జాంగ్ యాన్ ఆరోపించారు. అంతేకాదు ఆ ప్రావిన్స్ మేయర్‌ని కూడా తొలగించినట్లు తెలిపారు. చైనాలో సోమవారం నాటికి 2 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గత రెండేళ్లో చూస్తే ఇదే రోజువారిగా నమోదైన అధ్యధిక కేసుల సంఖ్య అని వెల్లడించారు. దీంతో షాంఘైలో పాఠశాలలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపారాలు తాత్కాలిక లాక్డౌన్లో ఉన్నాయి. ఈ మేరకు తాత్కాలికా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వీడియోని చైనా స్ధానిక మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. LIVE: A makeshift hospital is under construction in Jilin City in China's Jilin Province to cope with a resurgence of COVID-19. The facility, which will provide 6,000 beds, is expected to be completed within 6 days https://t.co/JJRuqZzzZO — China Xinhua News (@XHNews) March 14, 2022 (చదవండి: సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్) -
ఆరు రోజులుగా ఏడు లక్షల మంది
నాగార్జునసాగర్ : పుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు. ఎక్కువగా శివాలయం ఘాట్‌లోనే స్నానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో పోలీసులు కొంత మేరకు భక్తులను సురికివీరాంజనేయస్వామి ఘాట్‌తోపాటు ఊట్లపల్లి గాట్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సాగర్‌లో ఏర్పాటు చేసిన శివాలయం, సురికిఆంజనేయస్వామి, పొట్టిచెల్మఘాట్లలో ఈ ఆరురోజుల్లో దాదాపు ఏడు లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం శివాలయం ఘాట్ వద్ద 80వేల మంది, సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 34వేల మందితో మెుత్తం 1.14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. -
ఆరు రోజులుగా ఏడు లక్షల మంది
నాగార్జునసాగర్ : కష్ణాపుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు. ఎక్కువగా శివాలయం ఘాట్‌లోనే స్నానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో పోలీసులు కొంత మేరకు భక్తులను సురికివీరాంజనేయస్వామి ఘాట్‌తోపాటు ఊట్లపల్లి గాట్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సాగర్‌లో ఏర్పాటు చేసిన శివాలయం, సురికిఆంజనేయస్వామి, పొట్టిచెల్మఘాట్లలో ఈ ఆరురోజుల్లో దాదాపు ఏడు లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం శివాలయం ఘాట్ వద్ద 80వేల మంది, సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 34వేల మందితో మెుత్తం 1.14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. -
ఆరురోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎమ్ డి) తెలిపింది. జూన్ 1 నాటికి కేరళకు చేరుకో్వాల్సిన పవనాలు ఆలస్యంగా ఏడో తేదీన తాకే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవనున్నాయి. గత 11ఏళ్లుగా నైరుతి ఆగమనాన్ని వాతావరణ శాఖ సరిగ్గా అంచనా వేస్తోంది. ఈ కొద్ది రోజులు ఆలస్యమవడం పెద్ద విషయమేమీ కాదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ తెలిపారు. రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశంలో మరిన్ని వర్షాలు కురిసి ప్రజలకు వేడిమి నుంచి కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాథోర్ వెల్లడించారు.