మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం | Dispute Between Mangalagiri NRI Hospital Directors | Sakshi
Sakshi News home page

మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం

Published Thu, Jun 24 2021 3:48 PM | Last Updated on Thu, Jun 24 2021 3:52 PM

Dispute Between Mangalagiri NRI Hospital Directors - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. వివాదం కారణంగా డైరెక్టర్లు ముక్కామల అప్పారావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే తమకు మెజార్టీ డైరెక్టర్ల మద్దతు ఉందంటూ కొత్త కమిటీలను ప్రకటించుకున్నారు. 19 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ ముక్కామల.. కొత్త కమిటీ ఏర్పాటు చేయగా, 17 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ మరో కమిటీని ఉపేంద్రనాథ్‌ ఏర్పాటు చేశారు. మాజీ కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ, డైరెక్టర్ల మధ్య విభేదాలు వాస్తవమని.. ఆర్ధికపరమైన అవకతవకలపై విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు.

చదవండి: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్‌ వీరంగం 
పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement