ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం | AP Government Releases Directors List For 47 Corporations | Sakshi
Sakshi News home page

ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

Published Sat, Sep 4 2021 1:36 PM | Last Updated on Sat, Sep 4 2021 3:18 PM

AP Government Releases Directors List For 47 Corporations - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్‌ లక్ష్యమని సజ్జల అన్నారు.

బీసీలంటే చంద్రబాబుకు చులకన: మంత్రి వేణుగోపాల కృష్ణ  
బీసీలంటే చంద్రబాబుకు చులకన అని, వారిని ఓటు బ్యాంక్‌గానే చూశారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్‌ భరోసా కల్పించారన్నారు. సీఎంకు, సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేరన్నారు.

మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత
మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు.

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ..  బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్‌ అని అన్నారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. 

ఇవీ చదవండి:
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement