నటులుగా మారిన ప్రముఖ దర్శకులు | 5 Directors Turned Actors In Ponmagal Vandhal Movie | Sakshi
Sakshi News home page

ఓటీటీలో విడుదలకు సిద్దమైన జ్యోతిక సినిమా

Published Wed, May 27 2020 6:11 PM | Last Updated on Wed, May 27 2020 6:48 PM

5 Directors Turned Actors In Ponmagal Vandhal Movie - Sakshi

హీరోయిన్‌ జ్యోతిక లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘పొన్మగల్‌ వంధల్‌’ త్వరలో అమెజాన్‌ ప్రైంలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు పార్తీబన్‌, కె. భాగ్యరాజ్‌, త్యాగరాజన్‌, ప్రతాప్‌ పోటెన్‌, పాండియన్‌రాజన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినీ చరిత్రలో ఒకేసారి ఇంతమంది దర్శకులు కెమెరా ముందు నటించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను‌ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.

హీరో సూర్య సోంత బ్యానర్ ‌2డీ ప్రోడక్షన్‌లో రూపొందించిన ఈ సినిమాకు నిర్మాతలు సూరియా శివకుమార్‌, జేజే ఫ్రెడ్రిక్‌ తొలిసారిగా దర్శకత్వం వహిరించారు. కోర్టు నేపథ్యంలో సాగే ‘పొన్మగల్‌ వంధల్‌’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కేసును చేదించే శక్తివంతమైన మహిళ న్యాయవాదిగా జ్యోతిక కనిపించనున్నారు. దాదాపు 200పైగా దేశాలలో ఈ చిత్రం మే 29న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆమెజాన్‌ ప్రైంలో విడుదల కానుంది. (ఓటీటీకే ఓటు)

(చదవండి: బంగారు తల్లి వచ్చింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement