కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్‌వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్‌ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్‌పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
కాన్ఫరెన్స్‌లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వకీల్‌పల్లిగనిలో..
రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్‌వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాబోయే రోజుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎస్‌డీఎల్, కంటిన్యూస్ మైనర్‌యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్‌పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్‌లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్‌చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment