maining
-
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్‌ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్‌పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్‌లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్‌పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్‌లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఒకే రోజు 13 అనుమతులిచ్చారు: సీబీఐ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మొత్తం 14 మైనింగ్ లీజులకు ఆమోదం తెలిపారని సీబీఐ సోమవారం తెలిపింది. గనుల శాఖను తనవద్దే ఉంచుకున్న అఖిలేశ్ 13 లీజులను 2013, ఫిబ్రవరి 17న ఒక్క రోజులోనే క్లియర్ చేశారని వెల్లడించింది. ఇది యూపీ ఈ–టెండరింగ్ ప్రక్రియకు విరుద్ధమంది. సీఎం ఆమోదంతో ఈ లీజులను అప్పటి హమీర్పూర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ ఇతరులకు కేటాయించారని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఆమోదించిన ఈ– టెండర్ పాలసీ 2012కు విరుద్ధంగా ఈ కేటాయింపులు సాగాయంది. అఖిలేశ్‌కు మాయావతి ఫోన్ అక్రమ మైనింగ్ కేసులో అఖిలేశ్‌ను సీబీఐ విచారించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వివక్షాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. బీజేపీ ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తోందని బీఎస్పీ కాంగ్రెస్, ఆప్ ఆరోపించాయి. ఈ సందర్భంగా అఖిలేశ్‌కు ఫోన్ చేసిన బీఎస్పీ చీఫ్ మాయావతి..‘ఇలాంటి గిమ్మిక్కులకు భయపడొద్దు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తోంది’ అని తెలిపారు. ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తును అప్రతిష్టపాలు చేసేందుకే కేంద్రం ఇలాంటి వార్తలను వ్యాప్తిచేస్తోందని మండిపడ్డారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సీబీఐ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశం నిర్వహించడం రాజకీయ కుట్ర కాకుంటే మరేంటని ప్రశ్నించారు. కూటమిని నిలువరించేందుకే: కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్ష కూటమి ఏర్పాటును నిలువరించడానికి విచారణ సంస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. అఖిలేశ్ యాదవ్‌పై కేంద్రం నిసిగ్గుగా సీబీఐని ఉసిగొల్పుతోందని ప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాక్.. మైనింగ్ క్వారీలు సీజ్
సాక్షి, చీరాల : టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. పలు మైనింగ్, ఇసుక క్వారీలను సీజ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, అధికార టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారంటూ పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలో ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ ఇటీవల అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి వర్గీయులు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి. అంతేకాదు అదే పార్టీకి చెందిన పలువురు నేతలను సైతం బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు నేతలు సైతం ఆమంచి క్వారీయింగ్‌పై పలు ఆరోపణలు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ మైనింగ్‌పై దృష్టిపెట్టారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు. ఈదాడుల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. -
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా!
-
రు.32 కోట్ల జరిమానా చెల్లించండి: భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.