వివిధ రకాల స్కీమ్ల పేరిట డిపాజిట్లు సేకరించి అనంతరం ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టిన శ్రీచక్ర గోల్డ్ డైరెక్టర్లల్లో 10 మందిని విశాఖ నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. శ్రీచక్ర గోల్డ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 25 బ్రాంచీలను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. దానిలో 32 వేల మంది ఖాతాదారులను చేర్చుకుంది. వారి నుంచి పలు స్కీముల పేరిట రూ.15 కోట్లు సేకరించింది. అనంతరం సంస్థ బోర్డు తిప్పేసింది. దాంతో ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శ్రీచక్ర గోల్డ్ సంస్థపై కేసు నమోదు చేశారు.