ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్ల కొరత
ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్ల కొరత
Published Sat, Oct 22 2016 1:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్లు). కానీ వాటిని చూసుకోవడానికి డైరెక్టర్లే కరువయ్యారట. 20 ఐఐఎమ్స్లో సగం ఇన్స్టిట్యూట్లు డైరెక్టర్ లేకుండానే నడుస్తున్నాయని తేలింది. ప్రపంచ విద్యాసంస్థల సరసన ఒకటిగా నిలుస్తున్న ఐఐఎమ్ బెంగళూరు కూడా డైరెక్టర్ లేకుండానే కొనసాగుతుందని తెలిసింది. గత ఆరు నెలల కిందట ఈ రోజున ఈ విద్యా సంస్థలకు డెరెక్టర్లను షార్ట్లిస్టు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ భేటీ అయ్యాయి. ఆ భేటీలో 10 ఐఐఎమ్ల్లో నాలుగు సంస్థలు ఐఐఎమ్-రాంచీ, బెంగళూరు, రాయ్పూర్, రోహ్తక్ డైరెక్టర్ల పేరును ఖరారు చేస్తూ ఆ ఫైల్స్ను డీఓపీటీకి పంపించింది. కానీ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో డీవోపీటీ ఆ ఫైల్స్ను తిరిగి హెచ్ఆర్-డీ మంత్రిత్వ శాఖకు అందజేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐఐఎమ్స్లో డైరెక్టర్ల నియామకంపై ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు.
మరో ఆరు ఐఐఎమ్లు అమృత్సర్, సిర్మౌర్, నాగ్పూర్, బోధ్గయ, సంబల్పూర్, విశాఖపట్నం పరిస్థితి చూసుకుంటే సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ షార్ట్లిస్టు చేసిన పేర్లను హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ఇంకా ఖరారు చేసే ప్రక్రియలోనే ఉన్నాయని డీఓపీటీ అధికారులు తెలిపారు. అయితే హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ అధికారులు ఈ కామెంట్లపై స్పందించడానికి తిరస్కరిస్తున్నారు. బెంగళూరును మినహాయిస్తే, తొమ్మిది కొత్త ఐఐఎమ్ సంస్థలు డైరెక్టర్లు లేకుండా తాత్కాలిక క్యాంపస్ల్లో నడుస్తున్నాయి. చాలా ఇన్స్టిట్యూట్ల్లో అపాయింట్మెంట్స్, హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖలోనే మూలుగుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
Advertisement