‘‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నిర్వహిస్తున్న దర్శక సంజీవని మహోత్సవంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మీరంతా ఎన్నో కలలు కంటుంటారు. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగక ముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు... భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ, కలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగుతుంటారు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీని ‘దర్శక సంజీవని మహోత్సవం’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించింది. దివంగత దర్శకుడు డా. దాసరి నారాయణరావు పేరు మీద దాసరి హెల్త్ కార్డులను అందించారు. ‘‘మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ అసోసియేషన్‌కు నా సహకారం ఉంటుంది’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ. ‘‘అసోసియేషన్‌లోని 720 మంది హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 1920 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాం’’ అన్నారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్.
Comments
Please login to add a commentAdd a comment