సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్
భర్త సైఫ్ అలీఖాన్‌పై కరీనాకపూర్ ప్రశంసల జల్లు కురిపించింది. ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకు మెరుపులు కనిపిస్తాయంది. ‘నేను బుల్లెట్ రాజా సినిమా చూశా. ఎంతో నచ్చింది. సైఫ్ ఎంతో ప్రతిభాశాలి. సినిమాల్లో ఆయన నటనను బాగా ఇష్టపడతాను. అటువంటి గొప్ప నటుడతను. విజయవంతమైనా లేదా కాకపోయినా ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకూ మెరుపులు కనిపిస్తాయి’ అంటూ ప్రశంసించింది. సైఫ్ వ్యక్తిత్వం గొప్పదని, తెరపై ఆయన పర్సనాలిటీని ప్రేక్షకులు ఇష్టపడతారనేది తన భావన అని తెలిపింది.
కాగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో త్వరలో రూపొందనున్న సింగం 2లో అజయ్ దేవ్‌గణ్ సరసన కరీనాకపూర్ నటించింది. కరీనాకపూర్ అనేక సినిమాల్లో అజయ్ దేవ్‌గణతో కలిసి నటించింది. సింగం-2 సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని కరీనా తెలిపింది. కాగా హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘శుద్ధి’ సిని మాలో కరీనా నటించకపోవచ్చని, ఆమెకు బదులు దీపికా పదుకొణేకి అవకాశం లభించొచ్చంటూ బాలీవుడ్‌లో వదంతులు వెల్లువెత్తాయి. అయితే దీనిని నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు కరణ్ మల్హోత్రాలు కొట్టిపారేశారు. అయితే ఈ వదంతులను కరీనాకూడా కొట్టిపారేసింది. ఇదంతా మీడియా సృష్టేనంది. వీటన్నింటికీ దూరంగా ఉంటానంది.